ముఖంపై 6 కిలోల కణితితో 10 ఏళ్ల సావాసం | Doctors remove 6 kg tumor from man's face | Sakshi
Sakshi News home page

ముఖంపై 6 కిలోల కణితితో 10 ఏళ్ల సావాసం

May 30 2014 9:03 PM | Updated on Sep 2 2017 8:05 AM

ముఖంపై 6 కిలోల కణితితో 10 ఏళ్ల సావాసం

ముఖంపై 6 కిలోల కణితితో 10 ఏళ్ల సావాసం

స్లొవాకియాలో ముఖంపై ఆరు కిలోల బరువున్న కణితిని గత పదేళ్లుగా మోస్తున్న ఒ వ్యక్తికి ఆఖరికి ఆ కణితినుంచి విముక్తి లభించింది.

స్లొవాకియాలో ముఖంపై ఆరు కిలోల బరువున్న కణితిని గత పదేళ్లుగా మోస్తున్న ఒ వ్యక్తికి ఆఖరికి ఆ కణితినుంచి విముక్తి లభించింది. అయిదు గంటల పాటు సర్జరీ చేసి ఆ కణితిని వైద్యులు తొలగించారు.
 
స్టెఫాన్ జోలీక్ అనే ఆ వ్యక్తి ముఖంలో కొవ్వు ఫైబర్లు పెరిగి పెరిగి ఒక భయంకరమైన కణితిలా మారాయి. గడ్డం లా దవడ కింద ఆ కణితి వేలాడుతూ ఉండేది. దాని బరువు వల్ల అతని నడక, నిలబడే విధానం అన్నీ మారిపోయి నరక యాతన అనుభవించేవాడు. దీన్ని వైద్యులు మేడెలంగ్ వ్యాధి అంటారు.
 
చివరికి వైద్యులు దీన్ని తొలగించడంతో ఆయన ఇప్పుడు హాయిగా తలతిప్పగలుగుతున్నాడు. బరువు మోయకుండా నడవగలుగుతున్నాడు. అన్నిటికన్నా మించి రోడ్డు పై వెళ్తూంటే అతడిని ఎవరూ వింతగా చూడటం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement