డైట్‌ డ్రింక్‌ వాడితే బరువు తగ్గరు!

Diet Soda May Not Lead To Weight Loss Says California Court - Sakshi

కాలిఫోర్నియా: అధిక బరువుతో బాధపడుతున్నారా? మీ చింతను మాకు వదిలేసి మా దగ్గరున్న వస్తువును మీరు తీసుకెళ్లండి. బరువును తగ్గించుకుని ఆనందంగా జీవించండి.. ఇలాంటి యాడ్స్‌ రోజూ ఎన్నో వస్తుంటాయి. ప్రోడ​క్ట్‌ వాడక ముందు, తర్వాత అంటూ ఊదరగొట్టే ఫొటోలతో జనాలను బుట్టలో పడేస్తారు. దీంతో చాలామంది ఆ ప్రోడక్ట్‌ను కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇక్కడ కూడా ఓ మహిళ బరువు తగ్గడం కోసం డైట్‌ ప్రోడక్ట్‌ ఏళ్ల తరబడి వాడింది. కానీ, ఎలాంటి ఫలితం కానరాక చివరికి కోర్టుకెక్కింది. వివరాలు.. కాలిఫోర్నియాకు చెందిన షానా బాసెరా అనే మహిళ ఊబకాయంతో బాధపడుతోంది. ఎలాగైనా బరువు తగ్గించుకుకుందామని ప్రముఖ కంపెనీ డా.పెప్పర్‌కు చెందిన సోడా డైట్‌ డ్రింక్‌ను రోజూ వాడటం మొదలు పెట్టింది.

అలా 13 సంవత్సరాలు గడిచాయి. కానీ ఆమె బరువులో ఏమాత్రం మార్పు కనిపించలేదు. దీంతో విసుగెత్తిపోయిన మహిళ తను వాడుతున్న సోడా డ్రింక్‌ కంపెనీపై కోర్టుకెక్కింది. ఈ ప్రోడక్ట్‌ తనను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది. కానీ అనూహ్యంగా కోర్టు ఆమెకు దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.  మీరు తాగుతున్న సోడా డ్రింక్‌ను ఆ కంపెనీ ‘డైట్‌’ అని పేర్కొందే కానీ ఎక్కడా ‘వెయిట్‌ లాస్‌’ అని పేర్కొనలేదని స్పష్టం చేసింది. దీన్ని వినియోగదారులు తప్పుగా అర్థం చేసుకున్నంత మాత్రాన కంపెనీ వారిని మోసం చేసినట్టు కాదని వెల్లడించింది. ‘డైట్‌’ అంటే సాధారణ ఉత్పత్తుల కన్నా తక్కువ కేలరీలు కలిగి ఉండటమని వివరించింది. ప్రకటనలో కనిపించేవాళ్లు అందంగా, స్లిమ్‌గా ఉన్నవాళ్లు కనిపించినంత మాత్రాన మీరు కూడా అలా మారుతారని కాదని చెప్తూ కేసును కొట్టివేసింది. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top