డెన్మార్క్‌ యువరాజు అస్తమయం

Denmark Prince Henrik Dies at 83 - Sakshi

కోపెన్‌హాగన్‌, డెన్మార్క్‌ : డెన్మార్క్‌ యువరాజు హెన్రిక్‌(83) దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు రాజ నివాసమైన ఫ్రెండెన్స్‌బర్గ్‌ క్యాసిల్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. 2017 సెప్టెంబర్‌లో ఆయనకు డెమన్షియా వ్యాధి సోకింది. గత నెల 26న ఊపిరితిత్తుల ఇనెఫెక్షన్‌తో హెన్నిక్‌ ఆసుపత్రిలో చేరారు.

దీనిపై స్పందించిన రాజప్రసాదం.. యువరాజు హెన్రిక్‌ తన ఆఖరి రోజులు గడిపేందుకు త్వరలో ప్యాలెస్‌కు రానున్నట్లు పేర్కొంది. 1934లో జన్మించిన హెన్రిక్‌.. డానిష్‌ రాజ కుటుంబానికి చెందిన యువరాణి మార్గరెట్‌ 2ను 1967లో వివాహం చేసుకున్నారు. 1972లో మార్గెరెట్‌ రాణి అయ్యారు. అయితే, హెన్రిక్‌ను రాజుగా ఆమె ప్రకటించలేదు.

దీనిపై ఆయన పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. 2016లో పబ్లిక్‌ సర్వీసు నుంచి తప్పుకుంటూ యువరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తాను మరణించిన తర్వాత భార్య పక్కనే పూడ్చిపెట్టొద్దని కోరారు. రాణితో సమానంగా తనను ఎప్పుడూ చూడలేదని, మరణించిన తర్వాత కూడా అలాంటి హోదా తనకు వద్దని తెగేసి చెప్పారు.

రాజ సంప్రదాయాల ప్రకారం.. రాజు, రాణి మరణించిన అనంతరం పక్కపక్కనే పూడ్చిపెడతారు. యువరాజును అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై ప్యాలెస్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top