లాక్‌డౌన్‌: రికార్డు స్థాయిలో జనాభా పెరుగుదల | Sakshi
Sakshi News home page

జననాల రేటు పెరగనుంది: యునిసెఫ్‌

Published Sat, May 9 2020 9:55 AM

CoronaLockdown:India Will Be The Centre Of A Baby Boom Triggered - Sakshi

పారిస్‌: మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోవడంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే శర​ణ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు గణనీయంగా పెరగనుందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ యునిసెఫ్ తెలిపింది. ముఖ్యంగా భారత్‌లో జననాల రేటు రికార్డు స్థాయిలో ఉండనున్నట్లు వివరించింది. 

భారత్‌లో మార్చి చివరి వారం నుంచి లాక్‌డౌన్‌ అమలవుతోందని, ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు రెండు కోట్ల మంది పిల్లలు పుడతారని యునిసెఫ్‌ అంచనా వేసింది. భారత్‌ తర్వాత చైనా (1.35 కోట్లు), నైజీరియా(64 లక్షలు), పాకిస్తాన్‌ (50 లక్షలు) ఇండోనేషియా(40 లక్షలు) దేశాలలో అత్యధికంగా జననాల రేటు నమోదుకానుందని తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 11.6 కోట్లుగా ఉండనుందని యునిసెఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

‘ఇక కరోనా కష్టకాలంలో గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమయంలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పుట్టబోయే పిల్లలను ప్రమాదంలో పడేసినట్లే’ అని యునిసెఫ్‌ స్పష్టం చేసింది. ఇక గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 14.1 కోట్ల మంది పిల్లలు పుట్టగా, భారత్‌లో అత్యధికంగా 2.72 కోట్ల మంది పిల్లలు పుట్టారని గుర్తుచేసింది. ఇక 2015 నుంచి భారత్‌లో జననాల రేటు తగ్గుతూ వస్తోందని వివరించింది. ఈ ఏడాది మార్చి 11 నుంచి డిసెంబర్‌ 16 వరకు జరిపిన అధ్యయనం ప్రకారమే జననాల రేటుపై నివేదిక రూపొందించామని యునిసెఫ్‌ ప్రకటించింది.

చదవండి:
లిక్కర్‌కి వేలమంది, శవయాత్రలో 20 మందికేనా?
కరోనా: అందుకే మనదేశంలో మరణాలు తక్కువ​​​​​​​

Advertisement
 
Advertisement
 
Advertisement