కరోనా: రష్యా కీలక నిర్ణయం | Corona Virus: Russia to Suspend all International Flights | Sakshi
Sakshi News home page

కోవిడ్‌: రష్యా కీలక నిర్ణయం

Mar 26 2020 1:03 PM | Updated on Mar 26 2020 1:03 PM

Corona Virus: Russia to Suspend all International Flights - Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది.

మాస్కో: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అర్ధరాత్రి (మార్చి 27) నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి రెగ్యులర్‌ విమానాలతో పాటు చార్టర్‌ ఫ్లైట్స్‌ను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖను రష్యా ప్రభుత్వం ఆదేశించింది. అయితే విదేశాల నుంచి తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చే విమానాలకు సడలింపు ఉంటుందని రష్యా అధికారిక వెబ్‌సైట్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రోజువారి విమానాల నియంత్రణకు ఇంతకుముందే రష్యా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (కరోనా పోరుకై మరో అవకాశం సృష్టించుకోండి)

రష్యాలో కోవిడ్‌ బారిన పడి వారి సంఖ్య బుధవారం నాటికి 653కు చేరింది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 163 కరోనా పాజివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతముందు వారాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రష్యా కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది. కాగా, కరోనా వైరస్‌ కట్టడికి భారత్‌ సహా పలు దేశాలు ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. దేశీయంగా కూడా విమానాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి. (కరోనాపై యుద్ధం: భారత్‌పై చైనా ప్రశంసలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement