బట్టలుతికే చింపాంజీ వీడియో వైరల్‌ | Clever Chimpanzee Washes Clothes at Chinese Zoo | Sakshi
Sakshi News home page

బట్టలుతికే చింపాంజీ వీడియో వైరల్‌

Published Thu, Dec 5 2019 5:23 PM | Last Updated on Thu, Dec 5 2019 6:08 PM

Clever Chimpanzee Washes Clothes at Chinese Zoo - Sakshi

అచ్చం మనిషి వలనే చొక్కాకు సబ్బు పెట్టి నీళ్లలో ఉతికి చింపాజీ అబ్బురపరిచింది.

చాంగింక్‌ : చింపాంజీలు, మానవ చేష్టలను అనుకరించే తెలివైన జంతువులని తెల్సిందే. అయినప్పటికీ అప్పుడప్పుడు వాటి చేష్టలు చూస్తుంటే నవ్వు రావడమే కాకుండా, ఔరా అనేలా అబ్బురపరుస్తాయి. చైనా, చాంగింక్‌ రాష్ట్రంలోని ‘లెహే లెడు థీమ్‌ పార్క్‌’లో గత శుక్రవారం నాడు 18 ఏళ్ల యుహూ అనే చింపాజీ తన సంరక్షుడి తెల్లటి టీ షర్టును ఉతుకుతు కనిపించింది. నీళ్ల గుంట వద్ద కూర్చొని అచ్చం మనిషి వలనే చొక్కాకు సబ్బు పెట్టి, నీళ్లలో పదే పదే కుదించి, ఆ పక్కనే ఆరేయడం అబ్బురపరిచింది. ఈ తతంగాన్ని ఆ పక్కనే ఇనుప రాడ్లపై కూర్చున్న సోదరి చింపాంజీ ఎంజాయ్‌ చేసింది.

ఆ సమయంలో చింపాంజీ సంరక్షుకుడు ఆ చింపాంజీల కోసం వంట తయారు చేస్తున్నారని, ఈ లోగా ఈ దృశ్యాలను చూసిన పార్క్‌ వర్కర్‌ ఒకరు దాదాపు 30 నిమిషాలపాటు కొనసాగిన చింపాజీ చేష్టలను వీడియో తీశారు. చింపాజీలు తమ పడకలను మనుషులకన్నా శుభ్రంగా ఉంచుకుంటాయని ఆ వర్కర్‌ తెలిపారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement