టార్గెట్‌ పూర్తి చేయలేదని ఉద్యోగులకు వింత శిక్ష

China Company Forces Employees To Crawl On Road As Punishment For Not Completing Targets - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు టార్గెట్ తప్పనిసరి. అయితే ఇచ్చిన సమయానికి టార్గెట్ పూర్తవ్వకపోతే ఇచ్చే జీతంలో కోత విధించడం లేదా ఎక్కువ టైం పని చేయించుకోవడం చేస్తారు. ఇంకా కంపెనీ రూల్స్‌ కొంచెం కఠినంగా ఉంటే జాబ్‌ నుంచి తీసివేస్తారు. కానీ మీరు ఇప్పుడు చదవబోయే ఈ వార్త  వీటన్నింటికి భిన్నం. ఎప్పుడూ ఇలాంటి ఫనిష్మెంట్లేనా అనుకుందేమో కానీ చరిత్రలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని శిక్ష విధించింది ఓ చైనా కంపెనీ.

ఇయర్‌ ఎండింగ్‌ టార్గెట్ పూర్తి చేయలేదని తమ కంపెనీ సిబ్బందిని నడి రోడ్డుపై మోకాళ్లపై నడిపించారు. ట్రాఫిక్‌ మద్యలో సిబ్బంది అంతా మోకళ్లపై కూర్చోని చిన్న పిల్లాల్లా పాకుతూ వెళ్లారు. వారందరిని చూసి పాదచారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్‌ అయింది. కాగా కంపెనీ చర్యను కొంత మంది తప్పుపట్టగా, కొంతమంది ఉద్యోగులను విమర్శిస్తున్నారు. ఉద్యోగులను హింసింస్తున్నారని, వారిని అవమానించేలా కంపెనీ వ్యవహరిస్తుందని కొంత మంది మండిపడుతుండగా, డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని ఉద్యోగులను మరికొంత మంది విమర్శిస్తున్నారు. కాగా వీడియో వైరల్‌తో యాజమాన్యంపై విమర్శలు రావడంతో కంపెనీని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. 

అయితే ఇలా శిక్షించడం చైనా కంపెనీలకు మొదటి సారేంకాదు. గత ఏడాదిలో కూడా ఓ కంపెనీ ఇలాంటి పనిష్మేంటే ఇచ్చింది. టార్గెట్‌ పూర్తి చేయలేదని తమ సిబ్బందిని వరుసగా నిలబెట్టి అమ్మాయిలలో చెంపదెబ్బలు కొట్టించారు. కాగా ఇలాంటి అవమానకర ఘటనలు చైనా కంపెనీలలో తరచూ జరుగుతున్నా ప్రభుత‍్వం స్పందించకపోవడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top