పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే.. | Child sex abusers in Indonesia to face chemical castration | Sakshi
Sakshi News home page

పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే..

May 26 2016 10:10 AM | Updated on Sep 4 2017 12:59 AM

పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే దుర్మార్గులను అత్యంత కఠినంగా శిక్షించేందుకు ఇండోనేషియా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

జకర్తా: పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే దుర్మార్గులను అత్యంత కఠినంగా శిక్షించేందుకు ఇండోనేషియా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. పిల్లల్ని లైంగికంగా వేధించే వ్యక్తులకు మరణదండన, రసాయన అంగచ్ఛేదం (కెమికల్ క్యాస్ట్రేషన్‌) శిక్ష విధించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తాజాగా ఆమోదించారు.

14 ఏళ్ల బాలిక అత్యంత కిరాకతంగా గ్యాంగ్‌రేప్‌ చేయబడి, హత్యకు గురైన నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సుమత్రా దీవుల్లోని ఓ అడవిలో కాళ్లు చేతులు కట్టేసి నగ్నంగా పడి ఉన్న బాలిక మృతదేహం లభించింది. అత్యంత పాశవికంగా బాలికపై గత ఏప్రిల్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు టీనేజర్లకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బాలలపై నేరాలను అరికట్టేందుకు ఇండోనేషియా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 'బాలలపై లైంగిక నేరాలు అత్యంత కిరాకతమైనవి. ఈ చట్టం అలాంటి నేరగాళ్లకు అడ్డుకట్ట వేసి.. బాలలపై లైంగిక నేరాల నియంత్రణకు దోహదపడుతుందని భావిస్తున్నా' అని అధ్యక్షుడు జోకో తెలిపారు. ప్రస్తుతం దక్షిణ కొరియా, పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియాలోని కొన్ని రాష్ట్రాల్లో రసాయన అంగఛ్చేదాన్ని చట్టబద్ధమైన శిక్షగా అమలుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement