విషం చిమ్మిన జాతి విద్వేషం | Charleston victims: A pastor, a young man with promise and 7 others | Sakshi
Sakshi News home page

విషం చిమ్మిన జాతి విద్వేషం

Jun 19 2015 3:18 AM | Updated on Sep 3 2017 3:57 AM

విషం చిమ్మిన జాతి విద్వేషం

విషం చిమ్మిన జాతి విద్వేషం

ఇప్పటికే జాతి వివక్ష ఘటనలతో కుతకుతలాడుతున్న అమెరికాలో మరోసారి జాతి విద్వేషం విషం చిమ్మింది.

వాషింగ్టన్: ఇప్పటికే జాతి వివక్ష ఘటనలతో కుతకుతలాడుతున్న అమెరికాలో మరోసారి జాతి విద్వేషం విషం చిమ్మింది. ఇక్కడి దక్షిణ కరోలినాలోని చరిత్రాత్మక బ్లాక్‌చర్చిలో చొరబడిన ఒక శ్వేతజాతి అమెరికన్ విచ్చలవిడిగా కాల్పులు జరిపి చర్చి పాస్టర్, రాష్ట్ర సెనేటర్ సహా తొమ్మిది మందిని బలిగొన్నాడు. ఆ తర్వాత పారిపోయాడు. ఇటీవలే నిరాయుధులైన ఇద్దరు నల్లజాతివారిని అమెరికన్ శ్వేతజాతి పోలీసులు కాల్చిచంపడం, తాజాగా ఈ ఘటన జరగడంతో అమెరికావ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దక్షిణ కరోలినాలోని 19వ శతాబ్దానికి చెందిన ఈ చర్చి భవనంలో గురువారం ప్రార్థనా సమావేశానికి పెద్ద సంఖ్యలో చర్చి సభ్యులు హాజరయ్యారు. దాదాపు 21 ఏళ్ల వయసున్న డైలాన్ రూఫ్ అనే శ్వేతజాతి దుండగుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. కొంతసేపటికి పైకి లేచి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. వెంటనే తన కారులో పారిపోయాడు. అయితే కాసేపటికే పోలీసులు అతణ్ణి పట్టుకున్నారు.

ఈ ఘటనలో దక్షిణ కరోలినా సెనేటర్, చర్చి పాస్టర్ క్లెమెంటా పింక్నీతో పాటు మరో ఇద్దరు పురుషులు, ఆరుగురు మహిళలు మృతి చెందారు. కాల్పులకు ముందు హంతకుడు రూఫ్ చర్చిలో గంటసేపు గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాల్పుల సమయంలో చర్చిలో మొత్తం 12 మంది ఉండగా... తొమ్మిది మంది బలైపోయారు. ముగ్గురు బతికారు.  ఈ ఘటనపై   ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. దీన్ని మతిలేని చర్యగా అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement