breaking news
South Carolina Senator
-
యూఎస్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన టిమ్ స్కాట్
కొలంబియా(యూఎస్ఏ): 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్ ప్రకటించారు. మరో రెండు నెలల్లో అయోవాలో ఓటింగ్ ప్రారంభం కానున్న వేళ ఆదివారం అర్ధరాత్రి టిమ్ స్కాట్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పరిచింది. ఉపాధ్యక్ష పదవికి సిద్ధమేనా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. రిపబ్లికన్ సెనేటర్లలో ఏకైక నల్లజాతీయుడైన స్కాట్ అందరి కంటే ముందుగా మేలోనే అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు తెలిపారు. -
విషం చిమ్మిన జాతి విద్వేషం
వాషింగ్టన్: ఇప్పటికే జాతి వివక్ష ఘటనలతో కుతకుతలాడుతున్న అమెరికాలో మరోసారి జాతి విద్వేషం విషం చిమ్మింది. ఇక్కడి దక్షిణ కరోలినాలోని చరిత్రాత్మక బ్లాక్చర్చిలో చొరబడిన ఒక శ్వేతజాతి అమెరికన్ విచ్చలవిడిగా కాల్పులు జరిపి చర్చి పాస్టర్, రాష్ట్ర సెనేటర్ సహా తొమ్మిది మందిని బలిగొన్నాడు. ఆ తర్వాత పారిపోయాడు. ఇటీవలే నిరాయుధులైన ఇద్దరు నల్లజాతివారిని అమెరికన్ శ్వేతజాతి పోలీసులు కాల్చిచంపడం, తాజాగా ఈ ఘటన జరగడంతో అమెరికావ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దక్షిణ కరోలినాలోని 19వ శతాబ్దానికి చెందిన ఈ చర్చి భవనంలో గురువారం ప్రార్థనా సమావేశానికి పెద్ద సంఖ్యలో చర్చి సభ్యులు హాజరయ్యారు. దాదాపు 21 ఏళ్ల వయసున్న డైలాన్ రూఫ్ అనే శ్వేతజాతి దుండగుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. కొంతసేపటికి పైకి లేచి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. వెంటనే తన కారులో పారిపోయాడు. అయితే కాసేపటికే పోలీసులు అతణ్ణి పట్టుకున్నారు. ఈ ఘటనలో దక్షిణ కరోలినా సెనేటర్, చర్చి పాస్టర్ క్లెమెంటా పింక్నీతో పాటు మరో ఇద్దరు పురుషులు, ఆరుగురు మహిళలు మృతి చెందారు. కాల్పులకు ముందు హంతకుడు రూఫ్ చర్చిలో గంటసేపు గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాల్పుల సమయంలో చర్చిలో మొత్తం 12 మంది ఉండగా... తొమ్మిది మంది బలైపోయారు. ముగ్గురు బతికారు. ఈ ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు చేపట్టింది. దీన్ని మతిలేని చర్యగా అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా అభివర్ణించారు.