యూఎస్‌ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన టిమ్‌ స్కాట్‌ | US Republican Senator Highest Profile Candidate Tim Scott Pulls Out Of 2024 Presidential Campaign - Sakshi
Sakshi News home page

US Presidential Elections 2024: యూఎస్‌ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన టిమ్‌ స్కాట్‌

Published Tue, Nov 14 2023 5:50 AM | Last Updated on Tue, Nov 14 2023 1:26 PM

US Republican Senator Tim Scott pulls out of presidential campaign - Sakshi

కొలంబియా(యూఎస్‌ఏ): 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, సౌత్‌ కరోలినా సెనేటర్‌ టిమ్‌ స్కాట్‌ ప్రకటించారు. మరో రెండు నెలల్లో అయోవాలో ఓటింగ్‌ ప్రారంభం కానున్న వేళ ఆదివారం అర్ధరాత్రి టిమ్‌ స్కాట్‌ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఉపాధ్యక్ష పదవికి సిద్ధమేనా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. రిపబ్లికన్‌ సెనేటర్లలో ఏకైక నల్లజాతీయుడైన స్కాట్‌ అందరి కంటే ముందుగా మేలోనే అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement