ఇక ప్రతి కారులో ‘బ్రెతలైజర్‌’

cars will be fitted with a breathalyser - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వారి నేరాలు పునరావతం అవుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టేందుక ఐరోపా కూటమి సరికొత్త సాంకేతిక చర్యకు పూనుకుంది. 2022 సంవత్సరం నుంచి తయారయ్యే అన్ని కార్లలో ‘బ్రెతలైజర్స్‌’ను విధిగా అమర్చాలని ఆదేశించే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఎప్పుడో రూపొందించినప్పటికీ ఐరోపా మండలి గత వారమే ఆమోదముద్ర వేసింది. 2024 నుంచి అన్ని కార్లలో, అంటే పాత కార్లలో కూడా ‘బ్రెతలైజర్స్‌’ను తప్పని సరి చేసింది.

డ్రైవర్‌ ఇంజన్‌ను స్టార్ట్‌ చేసే ముందు తప్పనిసరిగా బ్రెతలెజర్స్‌ను ఊదాల్సి ఉంటుంది. అప్పుడే ఇంజన్‌ స్టార్ట్‌ అవుతుంది. సరిగ్గా ఊదక పోయినా ఇంజన్‌ స్ట్రార్ట్‌ కాదు. కారు స్టార్ట్‌ అయ్యాక మార్గమధ్యంలో మద్యం సేవించకుండా నివారించేందుకు మధ్య మధ్యలో కూడా బ్రెతలెజర్స్‌ను ఊదాల్సి ఉంటుంది. ఈ నిబంధనను మద్యం తాగి కారును నడిపిన కేసులో శిక్ష పడిన డ్రైవర్లకు మాత్రమే అమలు చేస్తామని బ్రిటన్‌ అధికారులు చెబుతున్నారు.

సాంకేతికంగా అది సాధ్యమా? అన్ని కార్లలో బ్రెతలెజర్స్‌ను అమర్చినప్పుడు, కారు నడిపే డ్రైవర్‌కు అంతకుముందు శిక్ష పడిందా, లేదా అన్న విషయాన్ని బ్రెతలైజర్స్‌ అనుసంధాన వ్యవస్థ ఎలా తెల్సుకుంటుంది ? మద్యం తాగి కారు నడుపుతున్న డ్రైవర్‌ అప్పుడు ఏ కారు నడిపారో ఆ కారుకు మాత్రమే వర్తింప చేస్తారా? అద్దె డ్రైవర్లను పెట్టుకున్నప్పుడు మరి ఏం చేస్తారు? ఇంతకుముందు శిక్ష పడిన డ్రైవర్, తనకు బదులుగా ఇతరులతోని బ్రెతలెజర్‌ను ఊదిస్తే...అప్పుడు ఏమిటీ? ఇత్యాది ప్రశ్నలకు బ్రిటన్‌ అధికారుల వద్ద ప్రస్తుతానికి సమాధానం లేదు. రానున్న కాలంలో వీటికి పరిష్కారం కనుక్కుంటారట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top