అత్యంత కాలుష్య నగరాల జాబితాలో కాలిఫోర్నియా

California Has Majority Of Ten Most Polluted cities In America - Sakshi

వాషింగ్టన్‌: అత్యంత ఓజోన్‌ కాలుష్యం గల పది అమెరికా నగరాల్లో కాలిఫోర్నియా ఎనిమిదో స్థానంలో ఉందని అమెరికన్‌ లంగ్‌ అసోసియేషన్‌ వార్షిక నివేదిక ‘ స్టేట్‌ ఆఫ్‌ ది ఎయిర్‌’ వెల్లడించింది. ఈ అసోసియేషన్‌ బుధవారం అత్యంత కాలుష్య నగరాల వివరాలను ప్రకటించింది. ఈ నివేదికలో లాస్ ఏంజలెస్-లాంగ్‌ బీచ్‌ ప్రాంతం అగ్రస్థానంలో ఉంది. 19 ఏళ్లుగా అమెరికన్‌ లంగ్‌ అసోసియేషన్‌ ప్రతి ఏటా ‘స్టేట్‌ ఆఫ్‌ ది’ పేరుతో కాలుష్య నగరాల నివేదికను వెల్లడిస్తోంది. గత నివేదికతో పోలీస్తే ఈసారి అన్ని రాష్ట్రాల్లో ఓజోన్‌ కాలుష్యం పెరిగింది. ఈ నివేదికలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

133 మిలియన్ల అమెరికన్లలో ప్రతి 10 మందిలో నలుగురు కలుషిత వాయువును పీల్చుకుంటున్నారు. దీంతో తీవ్ర అనారోగ్యం, అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా , గుండె జబ్బులు వంటి రోగాలకు గురవుతున్నారని నివేదిక తెలిపింది. 

‘మారుతున్న వాతావరణ పరిస్థితులు చూస్తే ఓజోన్‌ పొర మరింత ప్రమాదంలో ఉంది. ఇప్పటికే అన్ని నగరాల్లో కాలుష్యం పెరిగిపోతుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో అమెరికన్లు ఆరోగ్య సమస్యలకు గురవుతార’ని అసోసియేషన్‌ అధ్యక్షుడు హెరోల్డ్‌ పి. విమ్మెర్‌ తెలిపారు. కాగా వాయుకాలుష్య నివారణకు ఇప్పటికే చర్యలు చేపట్టామని, అన్ని రాష్ట్రాల్లో కాలుష్యాన్ని తగ్గించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని  హెల్తీ ఎయిర్‌ క్యాంపెయింగ్‌ డైరెక్టర్‌ లిండ్సే మోస్లే అలెగ్జాండర్ పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top