టూరిస్టుల స్వర్గంలో ఇంత దారుణమా! | British tourists attacked in Thailand | Sakshi
Sakshi News home page

టూరిస్టుల స్వర్గంలో ఇంత దారుణమా!

Apr 28 2016 5:58 PM | Updated on Sep 3 2017 10:58 PM

టూరిస్టుల స్వర్గంలో ఇంత దారుణమా!

టూరిస్టుల స్వర్గంలో ఇంత దారుణమా!

సందర్శకుల స్వర్గంగా వ్యహరించే థాయ్ లాండ్ లో ఇటీవల కాలంలో అక్కడికి వచ్చే విదేశీ టూరిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి.

బ్యాంకాక్: సందర్శకుల స్వర్గధామంగా పిలిచే థాయ్ లాండ్ లో ఇటీవల కాలంలో  విదేశీ టూరిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడ హాట్ టాపిక్ గా మారిపోయింది. వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా శ్రమించి ఇప్పటికే ముగ్గుర్ని అరెస్ట్ చేయగా, గురువారం నాడు నాలుగో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పీకలదాకా తాగడం వల్ల తాము అలా ప్రవర్తించామని, బాధితుల కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.

పోలీస్ ఉన్నతాధికారి చైయాకోర్న్  కథనం ప్రకారం... స్కాట్లాండ్ కు చెందిన ఓ వ్యక్తి (68), తన భార్య (65), కుమారుడు (43) తో కలిసి టారిస్టుల ప్యారడైజ్ గా పేరుగాంచిన థాయ్ లాండ్ కు వచ్చారు. అయితే వారికి ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. స్థానికులు కొందరు వారిపై విచక్షణారహితంగా దాడిచేశారు. థాయ్ లాండ్ లోని హువా హిన్ పట్టణంలో ఏప్రిల్ 13న ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీంతో అధికారులలో చలనం వచ్చింది. ఉరుకులు పరుగుల మీద విచారణ ప్రారంభించారు. థాయ్ లాండ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొందరు యువకులు పీకలదాకా తాకి నానా బీభత్సం సృష్టించగా, వీరి ఆగడాలకు స్లాట్లాండ్ కు చెందిన ఓ టూరిస్టు కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు.

టూరిస్ట్ దంపతుల కుమారుడు క్యాజువల్ గా ఓ థాయ్ యువకుడిని టచ్ చేశాడని, దీంతో ఆగ్రహించిన యువకుడు ఆ కుటుంబాన్ని చితకబాదినట్లు వీడియోలో కనిపిస్తోంది. కుమారుడిని ఎందుకు కొట్టావని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. మద్యం తాగిఉన్న నిందితుడి మిత్రబృందం ఈ ముగ్గురు స్కాట్లాండ్ కుటుంభసభ్యులపై ఓ రేంజ్ లో రెచ్చిపోయి దాడిచేశారు. చివరికి వారు రోడ్డుపై సృహతప్పి పడిపోయినా వారిని కాళ్లతో తన్నినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ వెంటనే అక్కడి నుంచి ఆ గ్యాంగ్ పరారైంది. మార్కెట్ ఏరియాలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. గత మార్చి నెలలో కోకుత్ ఐలాండ్ లో దారుణం జరిగింది. నలుగురు ఫ్రెంచి సందర్శకులపై విచక్షణా రహితంగా దాడిచేయడంతో పాటు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement