నవంబర్లో భారత్కు బ్రిటన్ ప్రధాని | British Prime minister to visit India in November | Sakshi
Sakshi News home page

నవంబర్లో భారత్కు బ్రిటన్ ప్రధాని

Oct 16 2016 12:14 PM | Updated on Aug 15 2018 2:30 PM

బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు.

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే వచ్చే నెలలో భారత్లో పర్యటించనున్నారు. నవంబర్ 6 నుంచి 8వ తేదీ వరకూ మూడురోజుల పాటు ఆమె భారత్లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం  ఓ ప్రకటన చేసింది. థెరిసా మే ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత యూరప్ మినహా బయట దేశాలతో ద్వైపాక్షిక చర్చలకు రావటం ఇదే మొదటిసారి. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో థెరెస్సా మే చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాల మధ్య అన్ని రకాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఉమ్మడి ఆర్థిక, వాణిజ్య తదితర అంశాలపై ఈ పర్యటనలో చర్చ జరగనుంది. ఆమె వెంట 16 మంది వ్యాపార ప్రతినిధులు కూడా భారత్‌కు రానున్నారు. కాగా  మే నెలలో చైనాలో హాంగ్‌ఝౌలో జరిగిన జీ-20 దేశాల సదస్సులో ప్రధాని మోదీ... థెరిసాను భారత్‌లో పర్యటించేందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement