నైజీరియాలోని తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం మైదుగురిలోని ఓ మసీదుపై జరిగిన బాంబుదాడిలో పది మంది చనిపోయారు.
దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోగా మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులెవరనేది తెలియాల్సి ఉంది. వారంలోనే నగరంలో ఇది అయిదో దాడి కావటం గమనార్హం. ఈనెల 14వ తేదీన మహిళా ఆత్మహుతి బాంబర్ దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారు.