breaking news
bamb
-
వైఎస్సార్సీపీ కార్యకర్తపై బాంబు దాడి
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా ఇప్పటికే అనేక దాడులకు పాల్పడుతున్న పచ్చపార్టీ శ్రేణులు.. మరో దారుణానికి ఒడిగట్టారు. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మల్లికార్జునపై ఆదివారం సాయంత్రం టీడీపీ నేతలు హత్యయత్నానికి యత్నించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇలాకాలో దౌర్జన్యకాండకు దిగారు. మరికుంటపల్లి వద్ద వ్యక్తిగత పని నిమిత్తం వెళ్లిన మల్లికార్జునపై బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకోగా.. మల్లికార్జున భార్య నాగవేణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికుల సహాయంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. టీడీపీకి చెందిన నాగరాజు, రెడ్డయ్య, ఈశ్వరయ్యలు తనను చంపడానికి ప్రయత్నించారని బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. (బాబు జమానాలో అంతులేని నిర్బంధకాండ) -
మసీదుపై బాంబుదాడి..
అబూజ(నైజీరియా): నైజీరియాలోని తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం మైదుగురిలోని ఓ మసీదుపై సోమవారం జరిగిన బాంబుదాడిలో పది మంది చనిపోయారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు పదార్థాలు ధరించిన ఓ గుర్తు తెలియని మహిళ ప్రవేశించి తనను తాను పేల్చేసుకుంది. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోగా మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులెవరనేది తెలియాల్సి ఉంది. వారంలోనే నగరంలో ఇది అయిదో దాడి కావటం గమనార్హం. ఈనెల 14వ తేదీన మహిళా ఆత్మహుతి బాంబర్ దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారు.