నేను ఇలాగే చేస్తా!.. అయితే ఏంటి?? | Barber Snips Customer's Ear | Sakshi
Sakshi News home page

నేను ఇలాగే చేస్తా!.. అయితే ఏంటి??

Dec 29 2017 6:58 PM | Updated on Apr 4 2019 3:25 PM

Barber Snips Customer's Ear - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలోని మిస్కాన్సన్‌ నగరంలోని 22 ఏళ్ల యువకుడు.. క్రిస్మస్‌ సందర్భంగా అందంగా రెడీ అవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా లేటెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ కోసం క్షౌరశాలకు వెళ్లాడు. లేటెస్ట్‌ ట్రెండ్‌ అయిన.. ‘2’ ఆకారంలో హెయిర్‌ కటింగ్‌ చేయాలని క్షురకుడికి చెప్పాడు. యువకుడి చెప్పింది వినిపించుకోని క్షరుకుడు.. ‘0’ ఆకారంలో హెయిర్‌ కటింగ్‌ చేశాడు. 

క్షరకుడు చెప్పినట్లు చేస్తున్నాడులే అన్న ధైర్యంతో యువకుడు కళ్లు మూసుకుని పాటలు వింటూ కాలం‍ గడిపేశాడు. కటింగ్‌ అంతా పూర్తయ్యాక.. అద్దంలో చూసుకుని యువకుడు ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. అంతే నేను చెప్పిందేమిటి? నువ్వేచేసిందేమిటి? అని క్షురకుడితో యువకుడు గొడవకు దిగాడు. ‘నేను ఇలాగే చేసా.. నువ్వు చెప్పింది వినపడలేదు.. ఇప్పుడు ఏం చేయగలవు’ అంటూ అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో.. క్షురకుడు చేతిలోకి కత్తి తీసుకుని యువకుడిపై దాడి చేశాడు. ఈ హఠాత్‌ పరిణామాన్ని యువకుడు ఊహించే లోపు..  చెవి భాగం కోసుకుపోయింది. 

ఈ ఘటనపై ఆగ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు క్షురకుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షురకుడిని 46 ఏళ్ల షబానీ ఖలీద్‌గా పోలీసులు గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement