ఇరాక్ రాజధాని బాగ్దాద్ రక్తసిక్తమైంది
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ రక్తసిక్తమైంది. రెండు చోట్ల జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 22 మంది మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు. బాగ్దాద్ లోని వాణిజ్య ప్రాంతంమైన అల్ జదీదాలో పేలుడు పదార్థాలతో కూడిన కారును పేల్చడంతో 15 మంది మృతి చెందగా50 మంది గాయపడ్డారు. మరో కారు బాంబును ఉత్తర బాగ్దాద్ లోని తజీలో ఉన్న ఆర్మీ చెక్ పోస్ట్ ను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారు. ఇందులో ఏడుగురు సైనికులతో సహా 20 మంది గాయపడ్డారు.బాగ్దాద్ లోని ఉగ్రవాదులను చెదరగొడుతున్న సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్టు పోలీసు అధికారి వెల్లడించారు.