చనిపోయాడనుకున్నారు.. కానీ బతికే ఉన్నాడు | Australian Man Found Alive Weeks After He Was Lost In Forest | Sakshi
Sakshi News home page

చనిపోయాడనుకున్నారు.. కానీ బతికే ఉన్నాడు

Jan 14 2020 8:47 AM | Updated on Jan 14 2020 9:00 AM

Australian Man Found Alive Weeks After He Was Lost In Forest - Sakshi

లెమిక్‌ తప్పిపోయిన ప్రాంతం; ఇన్‌సెట్‌లో లెమిక్‌

సిడ్నీ : ఒక వ్యక్తి మూడు వారాల పాటు ఎవరికి కనిపించకుండాపోవడంతో అందరూ అతను చనిపోయాడనే భావించారు. కానీ హఠాత్తుగా ఆ వ్యక్తి బతికేఉన్నాడన్న వార్త విని చాలా సంతోషించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆస్ట్రేలియాకి చెందిన లెమిక్‌ అనే వ్యక్తి క్వీన్స్‌లాండ్‌లోని డైంట్రీ అటవీప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు డిసెంబర్ 22న అతని వాహనం బోల్తా పడింది. అప్పటినుంచి లెమిక్‌ అదృశ్యమయ్యాడు.లెమిక్‌ అదృశ్యమైన అటవీ ప్రాంతానికి సముద్రం దగ్గరగా ఉండడంతో కొన్ని వేళ మొసళ్లు అక్కడ జీవిస్తున్నాయి. దీంతో లెమిక్‌ వాటికి ఆహారం అయ్యుంటాడని భావించారు. అటవీ అధికారులు అతని కోసం రెండు వారాలు గాలించినా ఫలితం లేకపోవడంతో తమ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం లెమిక్‌ వాహనం బోల్తా పడిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అతను బతికే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా మూడు వారాల పాటు అడవిలోనే చిక్కుకున్న లెమిక్‌ ఆరోగ్యం, మానసిక పరిస్థితి బాగానే ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మూడు వారాల పాటు అడవిలో ఉన్నలెమిక్‌  బెర్రీ, ఇతర పండ్లు తిని జీవించాడని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement