ఎటి అండ్ టి బంపర్ ఆఫర్ | AT&T launches international Wi-Fi Calling | Sakshi
Sakshi News home page

ఎటి అండ్ టి బంపర్ ఆఫర్

Apr 12 2016 3:18 PM | Updated on Sep 3 2017 9:47 PM

ఎటి అండ్ టి బంపర్ ఆఫర్

ఎటి అండ్ టి బంపర్ ఆఫర్

అమెరికాలోని ప్రముఖ టెలికాం సంస్థ ‘ఏటీ అండ్‌ టీ’ బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది.

న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ టెలికాం సంస్థ ‘ఏటీ అండ్‌ టీ’ బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. అమెరికాకు ఇతర దేశాల నుంచి రోమింగ్‌ ఛార్జీలు లేకుండా ఉచితంగా వై ఫై కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు  వెల్లడించింది.

వినియోగదారులు ఉన్న ప్రదేశంలో ఫోన్‌ సిగ్నల్‌ లేకున్నా..  బలహీనంగా ఉన్నాకూడా వైఫైకి కనెక్ట్‌ అయ్యి ఉంటే చాలు.. యూఎస్‌లోని తమ స్నేహితులకు కాల్స్‌ చేసుకోవచ్చని ఏటీ అండ్‌ టీ సంస్థ వెల్లడించింది. అందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని  చెబుతోంది. ఫోన్‌లో సిగ్నల్‌ తక్కువగా ఉన్నప్పుడు అమెరికాలోనూ ఈ సదుపాయం పనిచేస్తుందని వెల్లడించింది. యూఎస్‌ ఫోన్ నంబర్లకు కాల్‌ చేస్తేనే ఈ సదుపాయం వర్తిస్తుందట. అలాగే.. ఐఫోన్‌ 6.. 6ఎస్‌ ఫోన్లలోనూ,  9.3 ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుతున్న వారికి మాత్రమే ఈ  సదుపాయం అందుబాటులో ఉన్నట్లు ఏటీఅండ్‌టీ తన సైట్‌లో పేర్కొంది. కొన్ని దేశాల్లో వై ఫై కాలింగ్‌ సదుపాయం అందుబాటులో లేకపోవచ్చని వెల్లడించింది. ఒకసారి  ఈ ఫీచర్ ను మొబైల్ లో యాక్టివేట్ చేసుకుంటే, విదేశాలలో ఉన్నప్పుడు కూడా  తమ వై ఫై సేవలు నిర్విరామంగా పనిచేస్తాయని చెబుతోంది. దీనికోసం ఎలాంటి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటోంది. మీరు ఒక నేలమాళిగలో ఉన్నా, ఎలివేటర్ లో ఉన్నా కూడా శక్తిమంతంగా పనిచేస్తుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement