కుక్కంత ఎలుక! | Ancient Rats were Ten Times bigger than Modern Rats | Sakshi
Sakshi News home page

కుక్కంత ఎలుక!

Nov 9 2015 3:19 PM | Updated on Jun 2 2018 7:27 PM

కుక్కంత ఎలుక! - Sakshi

కుక్కంత ఎలుక!

ప్రస్తుత ఎలుకలకు దాదాపు పది రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్న ఏడు భారీ ఎలుక శిలజాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.

మెల్‌బోర్న్: ప్రస్తుత ఎలుకలకు దాదాపు పది రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్న ఏడు భారీ ఎలుక శిలజాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఏకంగా శునకం పరిమాణంలో ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జూలియన్ లూయిస్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం తూర్పు తైమూర్‌లో ఈ శిలాజాలను గుర్తించింది. ఇప్పటివరకూ గుర్తించిన ఎలుక జాతుల్లో ఇవే అతిపెద్దవని లూయిస్ తెలిపారు.
 
 ఇవి ఐదు కిలోలకు పైగా ఉన్నట్లు చెప్పారు.సాధారణంగా ఎలుకలు అరకిలో ఉంటాయని తెలిపారు. తాజాగా గుర్తించిన ఎలుక జాతులు అంతరించిపోవడానికి గల కారణాలపై ప్రస్తుతం దృష్టిసారించినట్లు చెప్పారు. ఖనిజ పనిముట్లు వాడకం ప్రారంభమైన తరువాత పెద్ద సంఖ్యలో అడవులు నరికివేత కారణంగా ఈ ఎలుక జాతులు కనుమరుగై ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య ఆసియాలో తొలి మానవ సంచారం గురించి తెలుసుకునే ప్రాజెక్టులో భాగంగా లూయిస్ బృందం పనిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement