హచ్ శునకంలా వెంబడిస్తుంది... | AirDog tracking drone could be the ultimate GoPro sidekick | Sakshi
Sakshi News home page

హచ్ శునకంలా వెంబడిస్తుంది...

Jun 18 2014 4:45 AM | Updated on Sep 2 2017 8:57 AM

హచ్ శునకంలా వెంబడిస్తుంది...

హచ్ శునకంలా వెంబడిస్తుంది...

మీరు ఎక్కడికెళ్లినా మిమ్మల్ని హచ్ శునకంలా వెంబడిస్తూ.. వీడియోలు తీసే సరికొత్త ద్రోన్ ఇది. పేరు ఎయిర్‌డాగ్. మీరు పరుగెత్తినా.. ఆటలాడినా.. ఎత్తై ప్రదేశాలకు వెళ్లినా.. కారులో దూసుకుపోతున్నా సరే..

మీరు ఎక్కడికెళ్లినా మిమ్మల్ని హచ్ శునకంలా వెంబడిస్తూ.. వీడియోలు తీసే సరికొత్త ద్రోన్ ఇది. పేరు ఎయిర్‌డాగ్. మీరు పరుగెత్తినా.. ఆటలాడినా.. ఎత్తై ప్రదేశాలకు వెళ్లినా.. కారులో దూసుకుపోతున్నా సరే.. ఇది పైనుంచి వీడియోలు తీయగలదు. అలలపై సర్ఫింగ్, మంచుపై, రోడ్లపై స్కేటింగ్ వంటివి చేసినా ఇది మిమ్మల్ని వెంబడిస్తూ కెమెరాలో బంధిస్తుంది. జస్ట్ ఎయిర్‌లీష్ అనే చిన్న కంప్యూటరైజ్డ్ ట్రాకర్ పరికరాన్ని చేతికి ధరిస్తే చాలు.. దాని నుంచి అందే సిగ్నళ్ల ఆధారంగా ఎయిర్‌డాగ్ ఫాలో అయిపోతుంది.
 
  సిగ్నళ్లను బట్టి.. ఎప్పుడు ఎగరాలి? ఎప్పుడు దిగిపోవాలి? అన్నది ఇది స్వతంత్రంగానే చేయగలదు. నిరంతరాయంగా 20 నిమిషాలు పనిచేసే ఈ ద్రోన్... ఎయిర్‌లీష్‌ను ధరించినవారిని గంటకు 64 కి.మీ. వేగంతో కూడా వెంబడిస్తుందట. దీనితో కొండంచున నిలబడి ఆకాశం నుంచి కూడా వీడియోలు తీసుకోవచ్చని, సినిమా షూటింగులకు సైతం ఉపయోగించవచ్చని దీనిని తయారు చేసిన అమెరికాలోని హెలికో ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వారు చెబుతున్నారు. ధర సుమారు రూ.60 వేలు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement