పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందమే వేరు. అలాంటిది.. పోగొట్టుకున్న 18 ఏళ్ల తర్వాత దొరికితే ఏ విధంగా ఉంటుంది? బ్రిటన్‌కు చెందిన కొలిన్ మెండోజా 1996లో జ్యూరిచ్ నుంచి జెనీవా వెళుతున్నప్పుడు ట్రైన్లో తన వ్యాలెట్ పోగొట్టుకున్నాడు. అందులో పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు క్రెడిట్ కార్డులు, కొన్ని రసీదులు ఉన్నాయి.
తర్వాత తన వ్యాలెట్ పోయిన విషయాన్ని గుర్తించిన కొలిన్.. పోలీసులకు ఫిర్యాదు చేసి, తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొత్త పాస్‌పోర్టు తీసుకున్నాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. కొలిన్ వ్యాలెట్ సంగతే మరిచిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఈ తరుణంలో 18 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌లోని ఓ పోలీసు అధికారి నుంచి అతడికి మెయిల్ వచ్చింది. చర్లోని ఓ మాల్లో తన వ్యాలెట్ దొరికిందన్నది దాని సారాంశం.
సామాజిక సంబంధాల వెబ్సైట్ ద్వారా కొలిన్ మెయిల్‌కు ఆ పోలీసు అధికారి వ్యాలెట్ విషయాన్ని తెలియజేశాడు. ఆ మెయిల్ చూసిన కొలిన్ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం అక్కడకు వెళ్లి వ్యాలెట్‌ను చూడగా, పాస్పోర్టుతో సహా అన్నీ అలాగే ఉన్నాయి. తన భార్య బహుమతిగా ఇచ్చిన వ్యాలెట్ తిరిగి దొరకడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు.
18 ఏళ్ల తర్వాత దొరికింది..!
Published Sun, Dec 7 2014 12:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement