బ్రిటన్ ఎంపీ కాక్స్ హత్యకేసులో వ్యక్తి అరెస్ట్ | A man has been charged with murder in connection with the shooting of Jo Cox | Sakshi
Sakshi News home page

బ్రిటన్ ఎంపీ కాక్స్ హత్యకేసులో వ్యక్తి అరెస్ట్

Jun 18 2016 10:47 AM | Updated on Sep 4 2017 2:49 AM

బ్రిటన్ మహిళా ఎంపీ జో కాక్స్‌ హత్యకేసుకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. థామన్ మెయిర్ (52) అనే వ్యక్తిని వెస్ట్ యార్క్‌షైర్‌ పోలీసులు అరెస్ట్ చేసినట్లు బీబీసీ వెల్లడించింది.

లండన్:  బ్రిటన్ మహిళా ఎంపీ జో కాక్స్‌ హత్యకేసుకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. థామన్ మెయిర్ (52) అనే వ్యక్తిని వెస్ట్ యార్క్‌షైర్‌ పోలీసులు అరెస్ట్ చేసినట్లు  బీబీసీ వెల్లడించింది. నిందితుడిని ఇవాళ కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా గురువారం బిర్స్టాల్ పట్టణంలో ఎంపీ జో కాక్స్పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. జో కాక్స్‌ కాల్పులు జరపటంతో పాటు, ఆమెపై దాడి చేసి కత్తితో దారుణంగా హతమార్చాడు. అతడు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మెయిర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు...అతడి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా  వెస్ట్ యార్క్‌షైర్‌ పోలీసు విభాగం యాక్టింగ్ చీఫ్ కానిస్టేబుల్ డీ కాలిన్స్‌  మాట్లాడుతూ కాల్పుల ఘటనలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు ఎంజీ జో కాక్స్కు దేశవ్యాప్తంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజకీయ నేతలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా 1990లో  ఈస్ట్బోర్నే ఎంపీ ఇయాన్ గౌ ఉత్తర ఐరిష్ టెర్రర్ గ్రూపు చేతిలో హతమయ్యారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement