పాక్‌ చెరలో 200 మంది భారతీయులు

52 Indian Fishermen Arrested By Pakistan - Sakshi

సాక్షి, ఢిల్లీ : తమ సముద్రజలాల్లోకి ప్రవేశించారనే నెపంతో 52 మంది భారత జాలర్లను పాకిస్తాన్‌ అరెస్టు చేసింది. ఈ మేరకు పాక్‌ అధికార వర్గాలు ఈ విషయాన్ని శనివారం దృవీకరించాయి. వారితో పాటు 8 వేట పడవలను అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్తాన్‌ అధికారులు తెలిపారు. అరెస్ట్‌ చేసిన మత్స్యకారులను జుడీషియల్‌ రిమాండ్‌ కోసం కరాచీలోని మలిర్‌ జైలు పంపినట్లు పాక్‌ వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్లోని దిండి తీర ప్రాంతానికి చెందిన వారు. 

రాత్రి పూట కావడంతో సరిహద్దులు గుర్తించలేక పాక్‌ జలాల్లోకి వెల్లినట్లు బాధితులు తెలిపారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న వరుస అరెస్టులతో అమాయకులైన జాలర్లు ఏళ్లపాటు జైళ్లలో మగ్గుతున్నారు. సత్ప్రవర్తన కారణంగానో, జాతీయ పండగల సందర్భంగా ఏ ఒక్కరికో ఇద్దరికో క్షమాబిక్ష లభిస్తోంది. మిగతా వారంతా ఎప్పటికి విడుదలౌతారో తెలియక నరకం అనుభవస్తున్నారు. గత నవంబర్‌ నుంచి దాదాపు 200 మంది భారతీయు జాలర్లను తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే నెపంతో పాక్‌ అరెస్టు చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top