నెల పాటు నిత్యవసర సరుకులపై 50 శాతం తగ్గింపు

50 Percent Discount On Groceries In UAE - Sakshi

దుబాయ్‌ : మార్చి 20న అంతర్జాతీయ హ్యాపీనెస్‌ డే సందర్భంగా యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిత్యవసర వస్తువులపై 50శాతం డిస్కౌంట్‌ ఇస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 600 దుకాణాల్లో ఈ తగ్గింపులు ఉంటాయని అరబ్‌ వార్త పత్రిక అల్‌ బయాన్‌ ప్రచురించింది. ప్రజల వాడే నాణ్యమైన బ్రాండ్‌ సరుకుల పై ఈ నెల 20 నుంచి ఏప్రిల్‌ 20 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని వినియోగదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ హషిమ్‌ అల్‌ నూయిమి సోమవారం ప్రకటించారు. సహకార సంస్థలు, లులూ, కార్‌ఫోర్‌ అవుట్‌ లెట్‌లు ఈ ఆఫర్‌ అందించే దుకాణాల జాబితలో ఉన్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top