ఇరాక్లో జాడలేని 40 మంది భారతీయులు | 40 Indians untraceable in Iraq's Mosul town | Sakshi
Sakshi News home page

ఇరాక్లో జాడలేని 40 మంది భారతీయులు

Jun 18 2014 11:02 AM | Updated on Sep 2 2017 9:00 AM

ఇరాక్లో తీవ్రవాదులు ఆక్రమించిన మొసుల్ పట్టణంలో ఉన్న 40 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియడం లేదు.

న్యూఢిల్లీ: ఇరాక్లో తీవ్రవాదులు ఆక్రమించిన మొసుల్ పట్టణంలో ఉన్న 40 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియడం లేదు. భారతీయుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మాజీ దూత సురేష్ రెడ్డిని బాగ్దాద్కు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మొసుల్లో ఉన్న 40 మంది భారతీయులతో సంప్రదించేందుకు సాధ్యంకావడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. తీవ్రవాదులు వీరిని బంధీలుగా ఉంచారా అన్న ప్రశ్నకు.. ఈ విషయాన్ని తాము నిర్ధారించలేమని సమాధానమిచ్చారు. ఇరాక్లో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని, సయ్యద్ తెలిపారు. తీవ్రవాదుల లక్ష్యం భారతీయులు కాదని, దాడుల్లో ఇప్పటి వరకూ ఒక్కరూ గాయపడినట్టుగా వార్తలు రాలేదని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement