చైనాలో 28 మంది ఉగ్రవాదులను హతమార్చారు.
బీజింగ్: చైనాలో 28 మంది ఉగ్రవాదులను హతమార్చారు. జిన్జియాంగ్ ప్రావిన్స్లో బొగ్గుగనిపై దాడి చేసి 16 మందిని చంపిన ఉగ్రవాద సంస్థకు చెందిన వారిని పోలీసులు చంపారని అధికారులు చెప్పారు.
గత సెప్టెంబర్లో ఉగ్రవాదులు దాడి చేసి పారిపోయాక వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంబంధిత ఉగ్రవాద సంస్థకు చెందిన 28 మందిని పోలీసులు కాల్చిచంపారు. కాగా ఉగ్రవాద సంస్థ పేరు ఏంటన్నది వెల్లడించలేదు. 2008లో ఏర్పడిన ఈ గ్రూపు వేర్పాటువాద కార్యకాలపాలకు పాల్పడుతోందని అధికారులు చెప్పారు.