వైమానిక దాడుల్లో 25 మంది పౌరులు మృతి | 25 civilians killed in raids on Syria IS bastion Raqa | Sakshi
Sakshi News home page

వైమానిక దాడుల్లో 25 మంది పౌరులు మృతి

Jun 22 2016 12:13 PM | Updated on Sep 4 2017 3:08 AM

సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వివిధ దేశాలు జరుపుతున్న వైమానిక దాడుల్లో సాధారణ పౌరులు సమిధలౌతున్నారు.

రఖా: సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వివిధ దేశాలు జరుపుతున్న వైమానిక దాడుల్లో సాధారణ పౌరులు సమిధలౌతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వాస్తవ రాజధాని నగరంగా భావించే రఖాలో మంగళవారం జరిగిన వైమానిక దాడుల్లో 25 మంది పౌరులు మృతి చెందనట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. మృతి చెందిన వారిలో ఆరుగురు చిన్నారులు సైతం ఉన్నారు.  పదుల సంఖ్యలో గాయపడిన వారు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఈ వైమానిక దాడులు జరిపినది ఎవరనేది మాత్రం తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement