పొగమంచు కారణంగా చైనాలో 106 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు.
పొగమంచు కారణంగా చైనాలో 106 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. ఆగ్నేయ చైనాలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ విమానాశ్రయాన్ని పొగమంచు దట్టంగా ఆవరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా వందలాది విమానాల సర్వీసులు ఆలస్యంగా బయల్దేరనున్నాయి.
ఈ సంఘటనతో వేలాది ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడింది. విమానాశ్రయ సిబ్బంది విమానాల రద్దు, ఆలస్యం విషయాన్ని లౌడ్ స్పీకర్లు, ఎస్ఎమ్ఎస్ల ద్వారా ప్రయాణికులకు చేరవేశారు. ప్రయాణికులు భోజనవసతి కల్పించారు. పొగమంచు కారణంగా ఇక్కడ మూడు రోజుల నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.