'రాష్ట్రంలో దోచుకో.... దాచుకో పాలన సాగుతోంది'


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో దోచుకో... దాచుకో పాలన సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఆదివారం హైదరాబాద్లో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ... అమరావతి భూములు అమ్ముకోవడానికి విదేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నాయకులుపై మండిపడ్డారు. ఆ అక్రమ ఆస్తులు దాచుకోవడానికే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.


ప్రజల దృష్టి మరల్చడానికే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై ఎమ్మెల్సీ కొల్లగట్ల నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాకుండా కాకమ్మ కబుర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చంద్రబాబుతోపాటు ఆపార్టీ ఎమ్మెల్యేలపై కోలగట్ల ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top