'బాబు మాటలకు, చేతలకు పొంతన లేదు' | ysrcp leader nagi reddy fires on chandrababu | Sakshi
Sakshi News home page

'బాబు మాటలకు, చేతలకు పొంతన లేదు'

Jan 25 2016 2:20 PM | Updated on Oct 1 2018 2:09 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు పొంతన లేదని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు పొంతన లేదని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి విమర్శించారు. రైతాంగం పూర్తిగా సంక్షోభంలో మునిగిపోయిన ఈ తరుణంలో.. స్విజ్జర్లాండ్ పర్యటనలో రాష్ట్ర వ్యవసాయం బాగుందని ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారన్నారు. ఈ విషయంపై చంద్రబాబు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నాగిరెడ్డి హితవు పలికారు.

కృష్ణా, గోదావరి డెల్టాలు ఎండిపోయి రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని నాగిరెడ్డి తెలిపారు. రైతాంగం ఎదుర్కోంటున్న సమస్యలపై బాబుకు స్పష్టత లేకపోతే.. టీడీపీకి ఓటేసిన రైతులనైనా అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు. లక్షలాది మంది రైతులు పొట్ట చేత పట్టుకొని పొరుగురాష్ట్రాలకు వలస వెళ్తున్న విషయాన్ని నాగిరెడ్డి గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement