
నేడు విశాఖలో పర్యటించనున్న వైఎస్ జగన్
వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం నాడు) విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
శారదాపీఠం సందర్శన
పీఠం వార్షికోత్సవాలకు హాజరు
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం విశాఖపట్నం వస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్ తెలిపారు. ఈ పర్యటన వివరాలను బుధవారం సాయంత్రం ఆయన మీడియాకు వివరించారు. గురువారం ఉదయం 7.30 గంటలకు వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీ కృష్ణయాదవ్ నివాసానికి వెళతారు. 10 గంటలకు పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠానికి వెళ్తారు. పీఠం వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం 11.45 గంటలకు పెందుర్తిలోని పార్టీ ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లి, ఇటీవలే వివాహం చేసుకున్న ఆయన కుమార్తె మాధవి-నితీష్‌కుమార్ జంటను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. 12.30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. గత ఏడాది జనవరి 27న కూడా శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొన్నారు. ఈ సారి ముగింపు ఉత్సవాలకు హాజరవుతున్నారు.