కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
హైదరాబాద్ సిటి: కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన నగరంలోని కూకట్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మూసాపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సహాయంతో ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(కూకట్‌పల్లి)