జనారణ్యంలోకి వచ్చిన ఓ అడవిపంది పార్కులో కలకలం సృష్టించింది.
హైదరాబాద్: జనారణ్యంలోకి వచ్చిన ఓ అడవిపంది పార్కులో కలకలం సృష్టించింది. దానిని పట్టుకునే ప్రయత్నంలో ఓ యువకుడు గాయపడ్డాడు. శుక్రవారం వనస్థలిపురం సాహెబ్‌నగర్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అడవి పందిని తరమడంతో అది సచివాలయనగర్‌లోని హుడా పార్కులో దూరింది.
దీనిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా, ఎదురుదాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. సాహెబ్‌నగర్ ప్రాంతవాసులు ఉచ్చులు, వలల సహాయంతో దానిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు తీసుకెళ్లారు.
ఇది కూడా డ్యూటీనే: పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసు
పట్టుకో..పట్టుకో.. పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ
హమ్మయ్య దొరికింది...ఉచ్చులో చిక్కుకున్న అడవిపంది
సాధించాం: అడవిపందిని అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు వెళ్తున్న స్థానికులు, పోలీసులు