ఎస్సీ వర్గీకరణను చేస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ తీర్మానం కూడా చేయకుండా మాదిగలను వంచించిన చంద్రబాబుకు
నేడు విజయవాడలో తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ సదస్సు
ముషీరాబాద్ : ఎస్సీ వర్గీకరణను చేస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ తీర్మానం కూడా చేయకుండా మాదిగలను వంచించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని, చంద్రబాబుకు సహకరించిన మందకృష్ణ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర సమన్వయ కర్త వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ హెచ్చరించారు. విద్యానగర్‌లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వంగపల్లి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కు అడ్డుగా ఉన్న అన్ని శక్తులను ఎదుర్కోనేందుకు టీఎంఆర్‌పీఎస్ సమాయత్తమవతోందన్నారు. చంద్రబాబు, మందకృష్ణలకు బుద్ధి చెప్పేందుకు తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఈనెల 21న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సదస్సును విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు. అదే రోజు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. సమావేశంలో చిలుక ప్రభాకర్ మాదిగ, జి.శ్యాంరావు మాదిగ, ఆర్.కృష్ణమాదిగ, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.