జూబ్లీహిల్స్లో కూలిన గోడ..భారీగా ఆస్తి నష్టం | wall fells causes heavy distruction in jubliee hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్లో కూలిన గోడ..భారీగా ఆస్తి నష్టం

Sep 12 2015 7:25 AM | Updated on Sep 3 2017 9:16 AM

జూబ్లీహిల్స్లో కూలిన గోడ..భారీగా ఆస్తి నష్టం

జూబ్లీహిల్స్లో కూలిన గోడ..భారీగా ఆస్తి నష్టం

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో 100 అడుగుల ఎత్తులో ఉన్న గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగింది.

హైదరాబాద్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో 100 అడుగుల ఎత్తులో ఉన్న గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగింది.

ఎత్తైన కొండపై గల ఓ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడ్ కూలి.. కింద రోడ్డుపై నిలిపిఉన్న వాహనాలపై కుప్పకూలింది. ఆ సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దాదాపు 10 కార్ల వరకు శిథిలాల కింది నలిగిపోయాయని, విద్యుత్ లైన్లు తెగిపడటంతో సరఫరాను నిలిపివేశామని, సహాయక చర్యలు కొనసాగుతాయని జీహెచ్ ఎంసీ అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement