
ఉద్యోగాలు ఇస్తారా..చావమంటారా..!
తమకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్యాలని..లేకుంటే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరు ...
సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట హోర్డింగ్ ఎక్కి ఇద్దరు యువకుల హల్‌చల్
రెండు గంటల పాటు హైడ్రామా..
సోమాజిగూడ: తమకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్యాలని..లేకుంటే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరు నిరుద్యోగ యువకులు హల్‌చల్ చేస్తూ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు.వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా భూపాల్‌పల్లికి చెందిన ప్రభాకర్, ఖమ్మం జిల్లాకు చెందిన చైతన్య 2006లో ఇంటర్‌మీడియట్‌లో క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఓకేషనల్ కోర్స్ పూర్తి చేశారు. అప్పటి నుండి ఉద్యోగాలకు ప్రయత్నించి అలసిపోయామన్నారు. ఓకేషనల్ అభ్యర్ధులకు సైతం ఉద్యోగాలు కల్పిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 428 అమలుకు నోచుకోకపోవడంతో తమలాంటి వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఇటీవల వెలువడిన వ్యవసాయ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల్లోనూ తమకు అన్యాయం చేశారని వారు ఆరోపించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్య అక్కడికి చేరుకుని ఫోన్‌లో వారతో సంప్రదింపులు జరిపారు. వ్యవసాయ శాఖ కార్యదర్శితో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈలోపు పోలీసులు హోంగార్డు వెంకటయ్య, జగన్ అనే వ్యక్తిని హోర్డింగ్‌పైకి ఎక్కించారు. మరోవైపు అప్పటికే తెప్పించిన క్రేన్ సహాయంతో వారిని కిందకు దించారు.