ఈ నెల 28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు | Trains cancelled due to construction works between kacheguda-Nadikudi lane | Sakshi
Sakshi News home page

ఈ నెల 28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు

Feb 5 2016 8:29 PM | Updated on Sep 3 2017 5:01 PM

కాచిగూడ-నడికుడి రైలు మార్గంలో చేపట్టనున్న నిర్మాణ పనుల నేపధ్యంలో ఫిబ్రవరి 28, 29 తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్నింటిని కాజీపేట్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ : కాచిగూడ-నడికుడి రైలు మార్గంలో చేపట్టనున్న నిర్మాణ పనుల నేపధ్యంలో ఫిబ్రవరి 28, 29 తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్నింటిని కాజీపేట్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు కాచిగూడ-మిర్యాలగూడ, పిడుగురాళ్ల-మిర్యాలగూడ ప్యాసింజర్ రైళ్లను ఆ రెండు రోజులు రద్దు చేయనున్నారు. కాచిగూడ-రేపల్లె డెల్టా ప్యాసింజర్, హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట్ మీదుగా మళ్లించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement