కేసీఆర్ సర్కార్ కూలుతుందని ఎప్పుడూ చెప్పలేదు | tpcc working president mallu bhatti vikramarka takes on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ సర్కార్ కూలుతుందని ఎప్పుడూ చెప్పలేదు

Jun 17 2016 5:53 PM | Updated on Oct 8 2018 9:21 PM

కేసీఆర్ సర్కార్ కూలుతుందని ఎప్పుడూ చెప్పలేదు - Sakshi

కేసీఆర్ సర్కార్ కూలుతుందని ఎప్పుడూ చెప్పలేదు

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుందని తానెప్పుడూ చెప్పలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుందని తానెప్పుడూ చెప్పలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉంటూ కే చంద్రశేఖర్ రావు అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్, ప్రాజెక్టుల టెండర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ను కూల్చేందుకు కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్నాయంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భట్టి విక్రమార్క పైవిధంగా స్పందించారు.

భూసేకరణపై ఉద్యమానికి కమిటీ: భూసేకరణ చట్టం ప్రకారమే ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని టీపీసీసీ కమిటీ డిమాండ్ చేసింది. భూసేకరణపై ఉద్యమానికి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో 20 మందితో ఓ కమిటీ వేశారు. ఆదివారం గాంధీభవన్లో కమిటీ సభ్యులు భేటీకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement