గ్రేటర్లో మూడు లక్షలకుపైగా కొత్త ఓటర్లు | Three lakhs new voters in GHMC | Sakshi
Sakshi News home page

గ్రేటర్లో మూడు లక్షలకుపైగా కొత్త ఓటర్లు

Jan 12 2016 7:25 PM | Updated on Sep 3 2017 3:33 PM

గ్రేటర్లో మూడు లక్షలకుపైగా కొత్త ఓటర్లు

గ్రేటర్లో మూడు లక్షలకుపైగా కొత్త ఓటర్లు

గ్రేటర్ పరిధిలో 82,834 బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు తొలగించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో 82,834 బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు తొలగించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో జనార్దన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... గ్రేటర్లో 3,87,530 మంది కొత్తగా ఓటర్లు నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో మొత్తం 74,36,247 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు.

అందులో 39,73,374 మంది మహిళ ఓటర్లు ఉండగా.... 34,61,919 మంది  పురుష ఓటర్లు ఉన్నారని తెలిపారు. అలాగే ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ జనార్దన్రెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement