ముగ్గురు చైన్‌స్నాచర్ల అరెస్ట్ | three chain snatchers arrested in hyderabad ramachandrapuram | Sakshi
Sakshi News home page

ముగ్గురు చైన్‌స్నాచర్ల అరెస్ట్

Nov 8 2016 4:58 PM | Updated on Sep 4 2018 5:24 PM

చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితులను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. బీహెచ్‌ఈఎల్‌లో నివాసం ఉండే పనుగొండ వీణ తన కుమార్తెను తీసుకుని ఈ నెల 4వ తేదీన రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

మంగళవారం ఉదయం బీరంగూడ చెక్‌పోస్ట్ కమాన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు దుండగులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ ముగ్గురూ పటాన్‌చెరు మండలం కర్దనూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. బీహెచ్ఈఎల్లో చైన్‌స్నాచింగ్‌ చేసినట్లు నిందితులు అంగీకరించారు. వారి నుంచి మూడు తులాల బంగారు గొలుసుతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కె.భుజంగరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement