నిజాంపేటలో దొంగల బీభత్సం | thieves hulchul in nizampet | Sakshi
Sakshi News home page

నిజాంపేటలో దొంగల బీభత్సం

Aug 21 2016 10:19 AM | Updated on Aug 28 2018 7:30 PM

నిజాంపేట బాలాజీ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

హైదరాబాద్ : కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట బాలాజీ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో దొంగలు పడి విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఓ ఇంట్లో 20 తులాలు బంగారు ఆభరణాలతోపాటు ఆర కిలో వెండి, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు.

అయితే సదరు ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఎంత సొత్తు చోరీకి గురైందనే విషయం తెలియరాలేదు. దొంగల బీభత్సంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... దోపిడి జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement