చర్చికి వెళ్లిన మహిళ అదృశ్యం | The woman went to the church was disappeared | Sakshi
Sakshi News home page

చర్చికి వెళ్లిన మహిళ అదృశ్యం

Apr 11 2016 6:07 PM | Updated on Sep 4 2018 5:07 PM

చర్చికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

చర్చికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దగ్గుమిల్లి అప్పాజీ భార్య లక్ష్మి(52) గృహిణి. ఆమె సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మియాపూర్‌లోని కల్వరి టెంపుల్ చర్చికి ప్రార్థన కోసం వెళ్లింది. ప్రార్థనల అనంతరం సాయంత్రమైనా ఆమె ఇంటికి తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు అన్ని చోట్లా ఆరా తీశారు. జాడ తెలియకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement