మిషన్ ఇంద్రధనుష్ విజయవంతం చేయండి | The success of the mission to indradhanus | Sakshi
Sakshi News home page

మిషన్ ఇంద్రధనుష్ విజయవంతం చేయండి

May 3 2016 1:47 AM | Updated on Sep 3 2017 11:16 PM

జిల్లాలో మిషన్ ఇంధ్రధనుష్ మూడవ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని...

సాక్షి,సిటీబ్యూరో: జిల్లాలో మిషన్ ఇంధ్రధనుష్ మూడవ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఇన్‌చార్జి ఏజేసీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 వ తేదీ 13 వరకు నాలుగు రోజుల పాటు ఇంద్ర దనుష్ మూడవ విడత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా 0-2 ఏళ్ల వయస్సు పిల్లలతోపాటు గర్భిణి స్త్రీలకు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని సూచించారు.ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మూడవ విడత ఇంద్రధనుష్ ఏర్పాట్లపై వివరించారు. సమావేశంలో అడిషనల్ డీఎంఅండ్ హెచ్‌ఓ పద్మజ, డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement