పిల్లర్ గుంటలో పడి బాలుడి మృతి | the death of the boy lying in the ditch | Sakshi
Sakshi News home page

పిల్లర్ గుంటలో పడి బాలుడి మృతి

Sep 29 2016 11:18 AM | Updated on Sep 4 2017 3:31 PM

పిల్లర్ గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్లో వెలుగుచూసింది.

 పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్‌లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్‌లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్‌లో పిల్లర్‌ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. గుంటల వద్ద ఎలాంటి సేఫ్టీ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కార్మికులు అనంతపూర్ వాసులుగా గుర్తించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement