విజయనగరం జెడ్పీకి కేంద్ర పురస్కారం | The award toVizianagaram ZP | Sakshi
Sakshi News home page

విజయనగరం జెడ్పీకి కేంద్ర పురస్కారం

Apr 19 2016 1:18 AM | Updated on Aug 15 2018 6:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా పరిషత్‌తోపాటు నాలుగు మండలాలు, ఆరు గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలకు ఎంపికయ్యాయి.

 ఈ నెల 24న జంషెడ్‌పూర్‌లో అందజేయనున్న ప్రధాని మోదీ
 
 సాక్షి, హైదరాబాద్, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా పరిషత్‌తోపాటు నాలుగు మండలాలు, ఆరు గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలకు ఎంపికయ్యాయి. 2014-15 ఏడాదికి గాను దేశంలో జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు ప్రకటించిన పురస్కారాల్లో భాగంగా ఏపీలో పలు స్థానిక సంస్థలకు ఈ గౌరవం దక్కింది.

పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్(పీఎస్‌పీ), రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్ (ఆర్‌జీజీఎస్‌పీ) అవార్డులను ఈ నెల 24న పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం సందర్భంగా జంషెడ్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement