తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లకు కార్మికలు భారీ సంఖ్యలో చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ ఎన్నికల పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగుతోంది. ఈ పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 114 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. దాదాపు 52848 మంది ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభమవుతుంది.


