'ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి' | tammineni veerabhadram open letter to cm kcr over mbc corporation establishment | Sakshi
Sakshi News home page

'ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి'

Nov 14 2016 7:12 PM | Updated on Aug 14 2018 10:54 AM

'ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి' - Sakshi

'ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి'

ఎంబీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌ : సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారానికి 700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ధారూరుకు చేరుకున్న తమ్మినేని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

గత 29 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప‍్రజల నుంచి అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు. పేరుకు బీసీలు అయినప్పటికీ సమాజంలో అత్యంత వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులాల్లో కొన్ని కులాలు మినహా దాదాపు 106 కులాలు అత్యంత వెనకబడి ఉన్నాయన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లోన్లు అందడం లేదని పేర్కొన్నారు. ఎంబీసీ కులాలకు చెందిన వారిని ఆర్థికంగా, సామాజికంగా స్థిరపడేందుకు వెంటనే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.10 వేల కోట్లు కేటాయించాలని తమ్మినేని లేఖలో కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement